MS Dhoni: ఐపీఎల్‌కు ముందు ధోనీకి బిగ్ రిలీఫ్.. “ఒప్పందాల” ఆరోపణలపై బీసీసీఐ సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఊరట లభించింది. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర ప్రయోజనాల ఘర్షణ) వివాదంలో బీసీసీఐ తీర్పు వెలువరించింది. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా ధోనీపై వచ్చిన ఆరోపణలకు కొట్టేశారు. ధోనీ ఇప్పటికే సీఎస్కే తరఫున్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో క్రికెట్ అకాడమీల యజమానిగా ఉంటడం నిబంధలకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని బీసీసీఐ తీర్పు వెలువరించింది.
READ MORE: Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఈ అంశంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా వివరణ ఇచ్చారు. “ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ధోనీ క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన మాట నిజమే. కానీ.. ఆ ఒప్పందం 2017లో జరిగింది. బీసీసీఐ కొత్త నిబంధనలు 2018 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చాయి. కాబట్టి పాత ఒప్పందాలకు ఇది వర్తించదు. ధోనీ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే. అతనికి బోర్డులో లేదా ఫ్రాంచైజీలో ఎటువంటి ‘ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్’ లేదా నిర్ణయాధికారం లేదు. కేవలం ఐపీఎల్ ప్లేయర్‌గా కొనసాగినంత మాత్రాన అది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు. అకాడమీ యజమానిగా ఉండటం వల్ల ధోనీ ఎవరికైనా ఫేవరిజం చూపినట్లు లేదా పక్షపాతంగా వ్యవహరించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఫిర్యాదు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడికి ధోనీతో లేదా ఆ సంస్థతో ఉన్న వాణిజ్యపరమైన విభేదాల వల్లే ఈ కేసు వేశారు. ఇది ఆలస్యంగా చేసిన ఫిర్యాదు.” అని తీర్పులో పేర్కొన్నారు. ఎట్టకేలకు ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనీకి క్లీన్ చీట్ రావడం ఊరట నిచ్చింది.
READ MORE: Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!