NTV Telugu Site icon

MS Dhoni: రిటైర్మెంట్‌ పుకార్లపై ఎంఎస్ ధోనీ క్లారిటీ..

Ms Dhoni

Ms Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్‌ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన నేపథ్యంలో మారోసారి క్లారిటీ ఇచ్చాడు.

READ MORE: Meerut Murder: భర్త దారుణహత్య.. జైలులో డ్రగ్స్ డిమాండ్ చేస్తున్న భార్య, లవర్..

తాను వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే ఫ్రాంచైజీ లాక్కెళ్లిపోతుందని ధోనీ వ్యాఖ్యానించారు. మరి కొన్ని సీజన్లు ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘‘చెన్నై సూపర్ కింగ్స్‌ నా ఫ్రాంచైజీ. మరి కొంత కాలం నా టీం తరఫున ఆడతాను. ఎందుకంటే.. నేను వీల్ ఛైర్‌లో ఉన్నా కూడా ఫ్రాంచైజీ సభ్యులు లాక్కెళ్తారు.’’ అని ధోనీ స్పష్టం చేశాడు. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చెన్నై జట్టుకే ఆడుతూ విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు 5సార్లు టైటిల్ అందించి ఐపీఎల్ లోనే బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. గతేడాది సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ధోనీ.. తాజా ప్రకటనతో ధోనీ మరి కొంత కాలం ఆడతాడని తెలియడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.

READ MORE: Meerut Murder: భర్త దారుణహత్య.. జైలులో డ్రగ్స్ డిమాండ్ చేస్తున్న భార్య, లవర్..