MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు ముగియడంతో ప్లేఆఫ్స్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూమ్ ఘటనను హర్భజన్ బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
స్పోర్ట్స్ యారీ పోడ్కాస్ట్లో మాట్లాడిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో భారీగా సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. అదే సమయంలో సీఎస్కే ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సంప్రదాయంగా జరిగే హ్యాండ్‌షేక్ కోసం లైన్లో నిలబడి ఉన్నారని హర్భజన్ తెలిపాడు. అయితే ఆర్సీబీ ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఎక్కువసేపు కొనసాగడంతో సీఎస్కే శిబిరంలో అసహనం పెరిగిందని తెలిపాడు.
Also Read
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ఈ విషయమై హర్భజన్ కథనం ప్రకారం.. ఆ సమయంలో ధోనీ ఎక్కువసేపు వేచి ఉండకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడని.. ఆ సమయంలో ఓటమి బాధతో ఉన్న ధోనీ, డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టెలివిజన్ స్క్రీన్‌ను కోపంతో కొట్టాడని హర్భజన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే “కెప్టెన్ కూల్” ధోనీ నిజంగానే కోపంతో టీవీ పగలగొట్టాడా? అనే చర్చ మొదలైంది. ధోనీ లాంటి ప్రశాంత స్వభావం ఉన్న ఆటగాడు ఇలా ప్రవర్తించాడంటే నమ్మలేకపోతున్నామని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. మరోవైపు కీలక మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత ఎంత పెద్ద ఆటగాడికైనా భావోద్వేగాలు సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే మరోసారి ప్లేఆఫ్స్ చేరకపోవడంకూడా అభిమానులను వెంటాడుతుండటంతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. అయితే హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ధోనీ లేదా సీఎస్కే మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు. అయినా ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది.
🚨 HARBHAJAN SINGH on Sports Yaari :
“MS Dhoni Broke the TV in anger after losing to RCB on 18th May in the dressing Room.” 🤯pic.twitter.com/mMhk69dbv7
— The Cricket View (@TheCricketView) May 24, 2026
తాజావార్తలు
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!