NTV Telugu Site icon

MS Dhoni Bike Collection Video: షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో.. ధోనీ కలెక్షన్‌కు బిత్తరపోపోవాల్సిందే!

Ms Dhoni Bike Collection Video

Ms Dhoni Bike Collection Video

MS Dhoni Bike and Car Collection Video Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘బైక్స్’ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జట్టులో ఎవరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా బైక్ వచ్చినా.. మహీనే ముందుగా నడిపేవాడు. మైదానంలోనే ఓ రౌండ్ వేసేవాడు. కెరీర్ ఆరంభం నుంచి నుంచి రిటైర్మెంట్ అయ్యేవరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ బైక్స్‌తో పాటు తనకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేసి గ్యారేజీలో భద్రంగా ఉంచుకున్నాడు. ధోనీ ఇంట్లో బైక్స్‌కు ఏకంగా పెద్ద గ్యారేజీనే ఉందంటే.. అతడి వద్ద ఎన్ని బైక్స్ ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఎంఎస్ ధోనీ బైక్స్‌ను గ్యారేజీలో పెట్టుకొవడమే కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా వాటిపై షికారుకు కూడా వెళ్తుంటాడు. ఆలా వెళ్లినపుడు చాలాసార్లే కెమెరాలకు కూడా చిక్కాడు. అంతేకాకుండా సొంతంగా బైక్స్ రిపేర్ కూడా చేస్తూ ఉంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు గతంలో చాలా సార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ధోనీ గ్యారేజీకి సంబందించిన పూర్తి వీడియో మాత్రం ఎప్పుడూ బయటికి రాలేదు. టీమిండియా మాజీ పేసర్, మాజీ బీసీసీఐ సెలెక్టర్ వెంకటేశ్ ప్రసాద్ పుణ్యమాని ధోనీ బైక్ కలెక్షన్స్ వీడియో బయటికి వచ్చింది.

Also Read: Bigg Boss 7: బిగ్‌బాస్‌-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్‌?

వెంకటేశ్ ప్రసాద్ భారత మాజీ ప్లేయర్ సునీల్ జోషి‌తో కలిసి ఎంఎస్ ధోనీ ఇంటిని తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా మహీ బైక్ కలెక్షన్స్‌ను చూసి వెంకటేశ్ ప్రసాద్ షాక్ తిన్నారు. ధోనీ గ్యారేజీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీడియో చూసి అందరూ బిత్తరపోస్తున్నారు. ధోనీ గ్యారేజీలో బైక్స్‌తో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. పైన మొత్తం బైక్స్ ఉండగా.. కింద కార్లు ఉన్నాయి. ‘షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో’ అని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు.

‘బైక్స్‌పై ఇంత పిచ్చి ఉన్న వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. అబ్బా ఇదీ ఏం కలెక్షన్, ఎంఎస్ ధోనీ ఏం మనిషి మహీ గొప్ప అచీవర్. అంతకుమించి గొప్ప వ్యక్తి. రాంచీలోని ధోనీ ఇంట్లో ఈ బైక్, కార్ల కలెక్షన్లు చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ధోనీ అభిరుచి, పిచ్చికి నిదర్శనం’ అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ధోనీ సతీమణి సాక్షితో కూడా వెంకటేశ్ మాట్లాడారు. రాంచీకి రావడం ఇది నాలుగోసారని, ధోనీ బైక్ కలెక్షన్ క్రేజీగా ఉందన్నారు. ఎంతో పిచ్చి ఉంటే తప్ప ఇన్నీ బైక్స్ కలెక్ట్ చేయడం సాధ్యం కాదన్నారు. ఇది ఓ బైక్ షో రూమ్‌లానే ఉందని సాక్షితో వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నారు.

Also Rad: Commonwealth Games 2026: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా