Mrunal Thakur : ఆ క్రేజీ కాంబినేషన్ లో నటించే అవకాశం దక్కించుకున్న హాట్ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్.. ఈ భామ సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.మృణాల్ తన మొదటి సినిమాతో నే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.ఇలా నటిగా మంచి పేరు సంపాదించుకన్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగులో ఈమె నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.ఈ సినిమా తో పాటు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి మరొక సినిమా లో కూడా నటిస్తుంది.ఈ సినిమా కూడా షూటింగ్ దశలో వుంది.ఇలా తెలుగులో వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉంది ఈ భామ ..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటున్నట్లు సమాచారం.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈమె నటించే అవకాశాన్ని అందుకున్నట్టు సమాచారం. మురగదాస్ దర్శకత్వంలో హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న ఓ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం శివ కార్తికేయన్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నారు. అందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మురుగదాస్ డైరెక్షన్లో సినిమా సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?