Site icon NTV Telugu

Mrunal Thakur: ఆ కారణం వల్లే నా లవర్‌కు నాకు బ్రేకప్ అయ్యింది: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ సినిమా ‘సీత’గా, ‘హాయ్ నాన్న’ చిత్రం ‘యష్ణ’గా దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్. ఇటీవలి కాలంలో ఈ స్టార్ హీరోయిన్ తన చిత్రాల ద్వారా కంటే తన ప్రేమ, పెళ్లి వార్తలతో నెట్టింట తెగ వైరల్‌గా మారారు. ఈ క్రమంలో మృణాల్‌ ఠాకూర్‌ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే శహర్‌ మే’ ఫిబ్రవరి 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని రివీల్ చేశారు.

READ ALSO: T20 World Cup 2026: ఓడిపోతారని పాకిస్థాన్‌కు ముందే తెలుసు.. అందుకే ఈ డ్రామా!

ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. తన ఎక్స్ లవర్ గురించి చెప్పి సోషల్ మీడియాను షేక్ చేశారు. తాను తన ఎక్స్ లవర్ విడిపోయామని, తనతో నా బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధ పడలేదని వెల్లడించారు. ‘నాకు దూకుడు ఎక్కువని, అందుకే నా ఎక్స్ లవర్ నాతో ఉండలేనని బ్రేకప్‌ చెప్పాడు. నిజానికి నేను యాక్టింగ్‌ చేయడం కూడా తనకు నచ్చలేదు. మా బ్రేకప్‌కు అది కూడా ఓ రిజన్. తను నా జీవితంలో నుంచి వెళ్లిపోయినందుకు నేనేం బాధపడలేదు. వాస్తవానికి తన మనస్తత్వం చూసి జాలి పడ్డాను. అలాంటి వాళ్లతో జీవితాంతం కొనసాగడం కూడా కష్టమే. అందుకే మేము విడిపోయాం. నిజానికి తనలాంటి వాళ్లతో కలిసి జీవిస్తే భవిష్యత్తులో నా పిల్లలకు కూడా అదే ఆలోచన విధానంతో పెరుగుతారు. అది నాకు నచ్చదు’’ అని మృణాల్‌ వెల్లడించారు. ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 20న ఆమె హీరోయిన్‌గా నటించిన హిందీ సినిమా ‘దో దివానే షెహర్ మే’ రిలీజ్ రడీ అవుతుంది. అలాగే ఆమె టాలీవుడ్‌లో అడివి శేష్‌తో కలిసి ‘డకాయిట్’ మూవీ చేస్తోంది.

READ ALSO: SIM Card Gold Extraction: పాత సిమ్ కార్డుల నుంచి రూ.26 లక్షల విలువైన బంగారం సేకరణ.. షాకింగ్ వీడియో వెలుగులోకి

Exit mobile version