Site icon NTV Telugu

Mrunal Thakur: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్‌ రూమర్స్‌.. స్పందించిన మృణాల్‌

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్ జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ ఎవరు, ఈ రూమర్స్‌పై మృణాల్ ఏ విధంగా స్పందించారు అనేది చూద్దాం.

READ ALSO: CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు.. కోకాపేటలో అప్పుడు రూ.10 వేలు.. ఇప్పుడు రూ.170 కోట్లు..

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌‌తో మృణాల్‌ ఠాకూర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన రూమర్స్‌పై తాజాగా ఈ స్టార్ హీరోయిన్ స్పందించారు. ‘ఇలాంటి రూమర్స్‌ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఫ్రీ పీఆర్‌ స్టంట్స్‌ ఇవి’ అంటూ సోషల్‌ మీడియాలో ఫేక్ ప్రచారానికి చెక్‌ పెట్టారు మృణాల్. గతంలో ఆమె తమిళ హీరో ధనుష్‌‌తో రిలేషన్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమె ధనుష్‌‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించి వాటికి చెక్ పెట్టారు. తనకు ధనుష్‌‌ మంచి స్నేహితుడంటూ అప్పుడే మృణాల్‌ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్ రావడంతో ఆమె పై విధంగా స్పందించి, ఆ వార్తలకు కూడా చెక్ పెట్టారు.

READ ALSO: Bad Dreams: పది రకాల పాడు కలలు ఇవే.. మీకు ఏమైనా వస్తున్నాయా ?

Exit mobile version