మృనాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో క్యూట్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేస్తూ మెప్పించింది.సీతా రామం సినిమాలో ఈమెను ఎంతో క్యూట్ గా చూసిన ప్రేక్షకులు బికినీ లో ఈ భామను చూసి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఈ భామ బికినీ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మృనాల్ ఠాకూర్ తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.జీవితంలో సంబంధాలు బలోపేతం కావాలంటే అందులో సెక్స్, లస్ట్ కీలకం అని చెబుతూ సాగే వెబ్ సిరీస్ ఇది.ఇందులోనే తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ పై తాజాగా మృనాల్ ఠాకూర్ స్పందించింది. అంతేకాదు సెక్స్ మరియు లస్ట్ గురించి తమ ఇంటిలోనీ పిల్లలతో పరిణతి చెందిన సంభాషణలు కనుక జరిపితే.. వాళ్లు బయట వాటి గురించి తప్పుడు సమాచారం పొందే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్పుకొచ్చింది.”సెక్స్, లస్ట్ గురించి పరిణతి చెందిన సంభాషణలు జరగడం ముఖ్యమని నేను ఎంతో బలంగా నమ్ముతాను. ముఖ్యంగా తమ ఇంట్లో యుక్త వయసులో ఉన్న వారితో దీనిపై మాట్లాడటం ఎంతో అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించాలి.ఈ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో అంగద్ బేడీ సరసన మృనాల్ నటించిన విషయం తెలిసిందే.. తాను పెళ్లి చేసుకోబోయే వాడిలో లస్ట్ ఏమేరకు ఉందో తెలుసుకోవాలని, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి అని ఇందులో ఆమె బామ్మ పాత్ర పోషించిన నీనా గుప్తా చెప్పడం ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుత కాలంలో కపుల్స్ మధ్య సంబంధాలు మరియు వాటిలో ఉండే సంక్లిష్టతల గురించి ఈ లస్ట్ స్టోరీస్ 2లో చూపించారని సమాచారం
