‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన మృణాల్..తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు తీసుకురాబోతోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘దో దీవానే సెహర్ మే’. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమాను ప్రఖ్యాత దర్శకుడు మరియు నిర్మాత అయిన సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. రవి ఉద్యవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే
Also Read : Ajith Kumar : అజిత్ నెక్ట్స్ మూవీపై కోలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్..
తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను షేర్ చేసింది. పోస్టర్‌తో పాటుగా, ‘శశాంక్, రోస్ని (సినిమాలోని పాత్రల పేర్లు) లతో కలిసి మీరు కూడా ప్రేమలో పడతారా?’ అనే క్యాప్షన్‌తో ఆమె ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. ఈ పోస్టర్ సినిమా కథ గురించి మరింత ఆసక్తి పెంచుతుంది. ఈ చిత్రంలో మృణాల్ పోషించే పాత్ర, ఆమె గతంలో చేసిన పాత్రల కంటే విభిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రేమ కథలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చే సంజయ్ లీలా భన్సాలీ బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
