NTV Telugu Site icon

Mrunal Thakur: బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్ !

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి మృణాల్ ఠాకూర్. తెలుగులోకి అడుగు పెట్టక ముందు పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లామర్‌ షోతో పాటు అద్భుతమైన నటనతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ క్రేజ్‌ ఆమెకు నేరుగా తెలుగులో నటించే అవకాశాన్ని అందించింది. అలా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ తొలిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం ‘సీతారామం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. తొలి చిత్రంతోనే వారి హృదయాలను దోచుకుంది. సీత క్యారెక్టర్‌లో నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

Read Also: Devara Release Trailer: ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో ట్రైలర్

ఈ సినిమాతో ఆమెను ఆఫర్లు వెంటాడాయంటే అతిశయోక్తి లేదు. వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలో అవకాశాన్ని అందుకున్న మృణాల్.. అద్భుతంగా నటించి ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ”ఫ్యామిలీ స్టార్” సినిమాలో నటించినా.. అది డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మధ్య ఫ్లాపులు ఎక్కువగా చవిచూస్తున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక ఇచ్చింది. అయినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు చేరువవుతోంది. తన గ్లామర్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమేజింగ్ పర్సన్‌.. రేపు చెన్నైలో కలుద్దాము. నీ బర్త్‌డేను జరపడానికి నేను ఆగలేకపోతున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఆ వ్యక్తితో చనువుగా ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది దీంతో ఈ ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరంటూ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. మృణాల్‌కు, ఆ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ.. ఫోటో మాత్రం వైరల్‌గా మారుతోంది. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ఇచ్చిన ఈ అమ్మడు.. మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. మరి నెక్స్ట్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాల్సిందే.

Show comments