Site icon NTV Telugu

Kalki 2898AD : కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Mrunal

Mrunal

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. బిగ్ బి అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also:Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి బెయిల్..

అయితే ఇందులో నటించినందుకు మృణాల్ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. దానికి కారణం ఈ అమ్మడుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది. కాగా, మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో తెలుగమ్మాయిగా చెదరని ముద్ర వేసుకుంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి. దీని తర్వాత ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడంతో బిజీ అయిపోయింది. అలాగే ఇటీవల నటించిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అవడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

Read Also:Parliament Session: నీట్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. లోక్‌సభలో గందరగోళం..

Exit mobile version