NTV Telugu Site icon

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ భలే డేట్ పట్టాడే..

Mr Bachan

Mr Bachan

Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల చేద్దామని అనుకున్న పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో సినిమా కాస్త ముందుగానే విడుదలకు రెడీ అయిపోయింది.

Lavu Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్‌లో వివరిస్తాం..

యాక్షన్ ఎపిసోడ్స్ కు అధిక ప్రాధాన్యత ఈ సినిమాలో ఉండనుంది. రవితేజ.. బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ అభిమానిన్న సంగతి విషయం తెలిసిందే. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆయన అభిమానిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరో రవితేజ నిజాయితీగల ఆదాయపు పన్ను అధికారిగా కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఆదాయపన్ను అధికారి ఓ బడ రాజకీయ నేత ఇంటిలో జరిగిన తర్వాత కథ ఏ విధంగా వెళ్తున్నది కథ సారాంశం. ఈ సినిమాలో హీరో రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈవిడకి ఇదే టాలీవుడ్లో మొదటి చిత్రం. జగపతిబాబు ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇకపోతే డైరెక్టర్ హరీష్ హీరో రవితేజ కాంబినేషన్లో ఇదివరకు మిరపకాయ, షాక్ సినిమాలు వచ్చాయి.

Anagani Satya Prasad: త్వరలోనే గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్..

Show comments