తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల పోలికల్ హీట్ పెరిగిపోతుంది. తాజాగా వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిపై అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని 15 మంది ఎంపీటీసీల్లో అవిశ్వసానికి 10 మంది ఎంపిటీసీలు మద్దతు పలికారు. జగిత్యాల ఆర్డీవో ఆఫీసులో ఎంపిటీసీలు తమ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని సమర్పించారు.
Also Read: Google Most Search in India 2023: ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా వెతికింది వీటికోసమే …
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంపీపీ కేటాయిస్తే.. వెల్గటూర్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపిటీసీలు తీర్మాన పత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేశారనే విమర్శలు వచ్చాయన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్‌లో సర్పంచ్‌లు, ఎంపిటీసీల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శమని ఎంపిటీసీలు పేర్కొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ అధ్వర్యంలో ధర్మపురి అభివృద్ధి జరుగుతుందని ఎంపిటీసీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది