NTV Telugu Site icon

YV Subba Reddy: వైఎస్ జగన్‌పై పెట్టినవన్నీ అక్రమ కేసులే!

Yv Subba Reddy

Yv Subba Reddy

వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్ ఫీడ్ ద్వారా కొనుగోలు చేయించాం అని గుర్తు చేశారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Also Read: Tej Pratap Yadav: 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే, ఐశ్వర్యా రాయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..

ఈరోజు ప్రకాశంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ‘వైసీపీ నేతలు, వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వం పెట్టినవన్నీ అక్రమ కేసులే. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం. సూపర్ సిక్స్ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం మేం పోరాటం చేస్తున్నాం. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతుల కోసం మా పార్టీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్ళారు. ఈనెల 28న పొగాకు రైతుల కోసం పొదిలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్ ఫీడ్ ద్వారా కొనుగోలు చేయించాం. రైతులకు వైసీపీ అండగా ఉంటుంది’ అని తెలిపారు.