Site icon NTV Telugu

Vijayasai Reddy : విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు

Vijayasai Reddy

Vijayasai Reddy

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు వరించింది. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. మాజీ చైర్మన్ టీజీ. వెంకటేష్ తో కలిపి అవార్డు అందుకున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. మహారాష్ట్ర సదన్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా తదితరులు అవార్డులు అందుకున్నారు.

Masterdating: యువతలో కొత్త “డేటింగ్” ట్రెండ్.. అసలు ‘‘మాస్టర్ డేటింగ్’’ అంటే ఏమిటి..?

ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో సరైన అవకాశాలు కల్పించాలన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ పాస్ చేయడం చరిత్రాత్మకమని తమిళసై వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో జరిగే చర్చలు ఆధారంగా చట్టాల ఉద్దేశం తెలుస్తుందని, తెలంగాణ కొత్త రాష్ట్రానికి యంగ్ గవర్నర్ ఎలా పని చేస్తారని నా మీద విమర్శలు వచ్చాయన్నారు తమిళిసై. కానీ నా పనితీరు తో రెండో రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం వచ్చిందని, గైనకాలజిస్ట్ గా కొత్త శిశువు డెలివరీ చేసినట్లుగా తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని కూడా సరిగ్గా నిర్వహించానన్నారు. పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని, అప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ మట్లాడుతూ.. పార్లమెంట్ లో వివిధ పద్దతుల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలని, ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ఎంపీలు నిరంతరం ప్రశ్నించాలన్నారు.

IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?

Exit mobile version