NTV Telugu Site icon

Uttam Kumar Reddy : టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రత్యర్థులను మించి హామీలు ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిక మద్దతుగా ప్రచారంలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నేను లంబాడి బాషా కూడా మాట్లాడుతా.. నా నియోజకవర్గంలో లంబాడి, గిరిజన సంక్షేమం కోసం బాగా పనిచేశా. ప్రతి తండా, గూడెం కు సీసీ రోడ్లు వేశా. టీఆర్‌ఎస్‌ పాలనలో తండాలు ఆగం అయ్యాయి. టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా.

పోడు భూములను సర్కార్ లాక్కుంటుంది. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిండు. మునుగోడు లో కూడా ప్రజల్లో అవగాహన కోసం సదస్సు పెట్టండి.. నేను వస్తా.. కొత్త గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు కూడా లేవు..చెట్లకిందనే పాలన నడుస్తుంది. గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్. బంజారాహిల్స్ లో బంజార భవన్ కట్టిండు మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితి ఎట్లా. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలి. మోడీ, కేసీఆర్ ను నిలదీయడానికి నేనున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.