Site icon NTV Telugu

Soyam Bapu Rao : జాతి కోసం పోరాడుతుంటే నాపై నిందారోపణలు చేయడం శోచనీయం

Soyam

Soyam

ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేనిపోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని ఎంపీ సోయం బాపురావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి ఎంపీ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సమావేశాలను వదిలి పెట్టి తాను కేస్లాపూర్ లో జరిగిన ఆదివాసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని జాతి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంటే తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆందోళన చేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.

Also Read : Siginreddy Niranjan Reddy : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ పీఆర్‌ఎల్‌ఐ తీసుకోస్తున్నారు

ఆదివాసీ మహిళలంటే తనకు దేవుళ్ళతో సమానమని, ఆడపడుచులను సోదరీమణులాగా, తల్లిలాగా భావిస్తానని ఎంపీ అన్నారు. ఆదివాసి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని తాను చెప్పడం జరిగిందని, మహిళలు వేరే విధంగా భావిస్తే తాను క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమేనని అన్నారు. కొందరు ఆదివాసీ నాయకులు రాజకీయ పార్టీల తెరవెనుక నుండి తన ప్రతిష్టను దిగజార్చు తు కుట్ర పన్నుతున్న విషయం తెలిసిపోయిందనీ అన్నారు. ఎందరు కుట్రలు పన్నినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, తాను మాత్రం మహిళా జాతికి ఎప్పుడు రుణపడి ఉంటానని వేరే విధంగా భావించకూడదని ఎంపీ కోరారు. చివరి శ్వాస వరకు ఆదివాసి జాతి కోసం పోరాడుతూనే ఉంటానని ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు.

Also Read : Cheteshwar Pujara: విదేశీ గడ్డపై సెంచరీ.. మళ్లీ జట్టులోకి వస్తానంటున్న సీనియర్ ప్లేయర్

Exit mobile version