Site icon NTV Telugu

MP Ramulu : బీజేపీలో చేరిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు

Mp Ramulu

Mp Ramulu

తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పి. రాములు నేడు ఢిలీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసేవారు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదలకు వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ళు,గ్యాస్,నీళ్లు,మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, దేశ ఖ్యాతి ,వికసిత భారత్ లక్ష్యాన్ని,పేదరిక నిర్ములన కోసం మోడీ చేస్తున్న పని చూసి బీజేపీలో చేరుతున్న అని రాములు చెప్పారన్నారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. రాములు చేరికను స్వాగతం పలుకుతున్నానన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారని, అన్నివర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే వ్యక్తి రాములు అని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వంలో దేశ ప్రజల పక్షాన పనిచేసేందుకు బీజేపీ లో చేరారని, రాములు చేరిక ప్రభావం రానున్న ఎన్నికల్లో ఉంటుందన్నారు.

10th Class Exam Schedule: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎంపీ పి.రాములు మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, దేశానికి సేవ చేయాలని భరత్ ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, నా నియోజకవర్గ అభివృద్ధి చెందలన్న ఉద్దేశంతో,ఎస్సి వర్గీకరణ కోసం,దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందని బీజేపీలో చేరానని ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజా సేవ,అభివృద్ధి నాకు ముఖ్యమని, మోడీ నాయకత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరానన్నారు. ఎవరిని విమర్శించడానికి కాదని, మోడీ నాయకత్వ పాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తానన్నారు. తక్కువ మాట్లాడుతా..ఎక్కువ పనిచేస్తానని, బీజేపీ కోసం పనిచేస్తానన్నారు. బాగా పనిచేస్తా అని మోడీతో చెప్పించుకునేలా పని చేస్తానన్నారు.

Vennela Kishore: హీరో కావాలంటే.. అవి కూడా ఉండాలి కదా బ్రో.. ?

Exit mobile version