NTV Telugu Site icon

Raghunandan Rao: మూసీ పరివాహక ప్రాంత బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది..

Raghunandan Rao

Raghunandan Rao

అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలతో కలిసి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హైడ్రాకు సపోర్ట్ చేశానని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. హైడ్రా మూసీ పరివాహక ప్రాంతం ఒకటేనా అనే విషయాన్ని ముందుగా బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బందులకు గురి చేయడమే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పని అని రఘునందన్ ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది.. బుల్‌డోజర్‌కు తాము అడ్డంగా నిలబడతామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మూడు గంటలు కాదు ఆరు గంటలు ఉంటామని రఘునందన్ రావు తెలిపారు.

Read Also: Minister Narayana: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందించండి..

గోల్నాక డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నాం.. ఎన్ని విభాగాల అధికారులు వచ్చి మార్కులు వేసిన మీకు అండగా నిలుస్తాం.. చివరి శ్వాస వరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పేద ప్రజలకు అండగా ఉంటారని రఘునందన్ పేర్కొన్నారు. రెండు రోజులపాటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కలుస్తాం.. చివరి శ్వాస వరకు మీకు మేము అండగా ఉంటామని ఎంపీ రఘునందన్ చెప్పారు. రాజకీయాలపై మాట్లాడి బురదలు చల్లుకోవడం కాకుండా.. చాతనైతే పేద ప్రజలకు అండగా ఉందాం అని అన్నారు.

Read Also: Game Changer vs Thandel: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్న చైతు?