Site icon NTV Telugu

MP R Krishnaiah : జేపీఎస్‌ల మూలంగానే జాతీయ అవార్డులు వచ్చాయి

Mp R Krishnaiah

Mp R Krishnaiah

రాజ్యసభ సభ్యులు ఆర్.కృషయ్యని కలిశారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. ఈ సందర్భంగా ఆర్ కృషయ్య మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న వారిని విధుల నుంచి తొగలిస్తామని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కుతో పంచాయతీ సెక్రటరీలను నియమించుకున్నారని, కొంతమంది ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘ముఖ్యమంత్రి మానస పుత్రిక జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టు. 9,355 పంచాయతీ కార్యదర్శులలో బీసీ ,sc, st లు ఉన్నారు. ప్రభుత్వం కంటికి కనిపించడం లేదా.. గ్రామపంచాయతీ పనుల్లో బిజీగా ఉంటున్నారు..

Also Read : karnataka Exit Poll: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..

జేపీఎస్ ల మూలంగానే జాతీయ అవార్డ్స్ వచ్చాయి.. పంచాయతీ కార్యదర్శుల డిమాండ్స్ నెరవేర్చక పోతే రాజకీయ పార్టీలు జేపీఎస్ లకు అండగా ఉంటాయి. ఇప్పటికైనా చర్చలకు పిలిచి డిమాండ్స్ నెరవేర్చలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నాం. మా ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 3 సంవత్సరాలకు పర్మనెంట్ చేస్తామని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. మళ్ళీ జీవో 26 లో కాంటాక్ట్ అని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమ్మె చేయొద్దని ప్రభుత్వం మెంక్షన్ చేయడంతో ఆందోళన చెందుతున్నాం. మేము రెగ్యులరా, కాంట్రాకట్టా, పర్మినెంట్ చేయడం పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు మేము సిద్ధం.’ అని ఆయన అన్నారు.

Also Read : Elon Musk: వాట్సాప్‌ని నమ్మలేం.. త్వరలో ట్విట్టర్‌లో ఆ సేవలను తీసుకువస్తాం..

Exit mobile version