ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశ వాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు. తాను చేస్తున్నది నిర్మాణ రంగంలో.. వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని విమర్శించారు. స్థాయి లేని వంశీకృష్ణ లాంటి వాళ్ళ పై స్పందించకూడదనే ఇంత కాలం మాట్లాడలేదన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.
Nike Layoff 2024: 1,600 మంది ఉద్యోగులను తొలగించనున్న నైకీ..
వెలగపూడి వంశీ వ్యాఖ్యల పై ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ గా స్పందించారు. 2019లో వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని తెలిపారు. అప్పుడు పోటీ చేసిన అక్కరమానికి బదులు వంశీనే బెటర్ అభ్యర్ధి అని సీఎంకు చెప్పానని అన్నారు. ఈ విషయం తెలీక వంశీ తనపై అనుమానం పెంచుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వంశీ అనేక సార్లు తనపై విమర్శలు చేసిన స్పందించలేదని తెలిపారు. వంశీని రెండు సార్లు ఓడించి మళ్లీ సిగ్గులేకుండా వంశీ ఇంటికి వెళ్ళి ఆయన తిడుతూ ఉంటే వెలగపూడి నవ్వుతూ ఉన్నాడని చెప్పారు. వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయి అయిన వెలగపూడి.. ఆయన్ను ఆరాధించే జనసేన పార్టీ నేత అయిన వంశీ ఇంటికి వెళ్ళి తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తనపై గతంలో విమర్శలు చేస్తే తిరిగి చేశాను తప్ప.. తాను ఎప్పుడూ అనవసరంగా విమర్శలు చేయనని సత్యనారాయణ తెలిపారు.
TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్
రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వంశీ.. విజయసాయి రెడ్డి దయ వల్ల కార్పొరేటర్ అయ్యారని ఎంవీవీ పేర్కొన్నారు. వంశీ కనీసం ఒక్క మనిషిగా కూడా మాట్లాడలేదు.. వంశీ పై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ ఉన్నాయని తెలిపారు. మేకప్ వేస్తే బాబు మోహన్ కంటే తక్కువ స్థాయి కేరక్టర్ ఆర్టిస్ట్ లా ఉండే వంశీ నన్ను తంతాడట అని మండిపడ్డారు. కుక్క కంటే దారుణమైన పంది జాతికి చెందిన వాడు వంశీ అని దుయ్యబట్టారు. రంగాను వెలగపూడి ఎలా చంపాడో బయట పెడతానని అన్నారు. తానేదో భూ అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు చేస్తున్నారని.. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నన్నేదో చేస్తానన్నట్టు చెప్తున్నారని ఎంవీవీ తెలిపారు. నా వెంటుక పీక్కోమని వెలగపూడికి చెప్తున్నా.. నా అక్రమాలపై ఆధారాలు ఉంటే తీసుకురండని సత్యనారాయణ అన్నారు.