NTV Telugu Site icon

MP Mithun Reddy: జగన్‌ సీఎం కాకపోతే జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి..!

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే జరిగిన నష్టాన్ని.. మళ్లీ జరగబోయే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి.. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా మిథున్ రెడ్డి హాజరుకాగా.. మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పొన్నాడా సతీష్, జిల్లా వైసీపీ నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా నిర్వర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. సచివాలయాన్ని జన్మభూమి కార్యాలయంగా మార్చేస్తారని విమర్శించారు.

Read Also: Bengaluru water crisis: బెంగళూర్‌లో తీవ్ర నీటి సంక్షోభం.. డిస్పోజబుల్ ప్లేట్లు, వెట్ వైప్స్ వాడాలని కోరుతున్న గేటెడ్ కమ్యూనిటీలు..

ఇక, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కచ్చితంగా పార్టీలు గుర్తింపు ఉంటుందని తెలిపారు మిథున్‌రెడ్డి.. పి గన్నవరం ఇంచార్జ్ విప్పర్తి వేణుగోపాల్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పిలుపునిచ్చారు. మరోవైపు.. రాజులు ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉంటాను.. ఆయన సూచిస్తే అమలాపురం లోక్‌సభ నుంచి పోటీకే నేను సిద్ధమే అని ప్రకటించారు ఎమ్మెల్యే రాపాక.