NTV Telugu Site icon

Mudragada Padmanabham: నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి..!

Mudragada

Mudragada

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి.. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. ముద్రగడతో సమావేశం కానున్నారు.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం.. మరోవైపు.. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ విషయాన్నే స్వయంగా ముద్రగడకు వివరించనున్నారట మిథున్‌రెడ్డి..

Read Also: Uttarpradesh : చౌరస్తా మధ్యలో చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి.. ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు

అయితే, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతోంది ముద్రగడ కుటుంబం.. ఇక, ఎన్నికల ముగిసిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి తగిన పదవి ఉంటుందని కూడా మిథున్‌ రెడ్డి హామీ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఇక, ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నమాట. కాగా, మొదట వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముద్రగడ.. ఆ పార్టీలోకి వెళ్లేది లేదని బహిరంగంగా ప్రకటించారు.. జనసేన, టీడీపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.. ఓ దశలో జనసేన పార్టీలో ముద్రగడ చేరడం ఖాయమనే ప్రచారం సాగింది.. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, అంతా సైలెంట్‌ కాగా.. ఇప్పుడు వైసీపీ ఆయనతో టచ్‌లోకి వెళ్లింది.

Show comments