MP Margani Bharat: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటూ మహానాడులో చెప్పగలవా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాల పర్యటనపై స్పందించిన ఆయన.. నిన్న చంద్రబాబు పర్యటన దండగ అన్నారు.. 58 లక్షల మందికి కిసాన్ రైతులకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం.. కానీ, చంద్రబాబు హయాంలో జరిగిన బషీర్‌బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదన్నారు.. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది … చిట్స్ వ్యాపారం చేసే వ్యక్తి వందల కొట్లు బ్లాక్ మెయిల్ చోట్ల అనేది వాస్తవం అన్నారు. ఓటుకు నోటులో దొరికి ఏపీకి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.. పుష్కరాల సమయంలో 29మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు.. ఇప్పటికీ వారిని పరామర్శించలేదని మండిపడ్డారు.. ఆర్ధిక నేరాలు చేసే వారికి వత్తాసు పలుకుతున్నాడు.. బ్లూ మీడియా అని చంద్రబాబు మాట్లడం కరెక్ట్ కాదని హితవుపలికారు..
Read Also: ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి పాకిస్తాన్
చంద్రబాబు పర్యటన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే అని మండిపడ్డ భరత్.. కార్యకర్తలను రెచ్చగొట్టడానికేనా ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ రైతులకు ఉచిత కరెంటు ప్రకటిస్తే.. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికేనంటూ వ్యాఖ్యానించిన వ్యక్తి చంద్రబాబు.. రైతుల కోసం సీఎం జగన్ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే తడిచిన రంగు మారిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టారు.. చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన భూదందాపై సిట్ ఏర్పాటు చేస్తే హైకోర్టు స్టే తెచ్చి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే కొట్టేయడంతో అమరావతి భూ అక్రమాలు వెలుగులోకి రానున్నాయని తెలిపారు. ఇక, జగజ్జనని చిట్ ఫండ్స్ లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఖాతాదారుల సొమ్ముతో అదిరెడ్డి అప్పారావు సొంత ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు ఎంపీ మార్గని భరత్.