NTV Telugu Site icon

Margani Bharat: కుట్ర చేసి పింఛన్లు ఆపారు.. ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి..?

Margani Bharat

Margani Bharat

Margani Bharat: ఎన్నికల సమయంలో ఏపీలో ఫించన్లు నిలుపుదలపై పొలిటికల్‌ హీట్‌ పెరుగుతుంది.. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుబడుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీనిపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్ రామ్.. సీఎం వైఎస్‌ జగన్ ఇవాళ పెన్షన్ పంపిస్తారని వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుట్రపన్ని ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి పింఛన్లు నిలిపివేశారని ఆరోపించారు. వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటు తీసుకుని ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. కానీ, పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి…? అని నిలదీశారు.

Read Also: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.

చంద్రబాబు ఎంతమందిని పొట్టన పెట్టుకోనున్నారు అని విమర్శించారు భరత్‌ రామ్‌.. ఎందుకు పెన్షన్ పంపిణీ అడ్డుకుంటున్నారు.. వాలంటీర్లను ఎందుకు దొంగల్లా చూస్తున్నారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవటానికి 10 గంటలు లైన్‌లో నుంచోవాల్సిన పరిస్థితి ఉండేది.. అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ అడ్డుకున్న వ్యక్తి నరరూప రాక్షసుడైన చంద్రబాబే అంటూ ఆరోపించారు. ఇక, ఒక టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్ అని కొనియాడిన ఆయన.. చంద్రబాబుది పూర్తిగా పెత్తందారి మనస్తత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు లాంటి వ్యక్తుల వల్ల సమాజం భ్రష్టు పట్టి పోతుంది.. హైదరాబాదులో ఉంటారు ఆంధ్రాలో రాజకీయాలు చేస్తారు అని సెటైర్లు వేశారు. గతంలో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏ సాధించారు? అని నిలదీశారు. పొత్తుతో 2024లో సాధించబోయేది ఏమిటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి అని డిమాండ్‌ చేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయనివ్వమని చంద్రబాబు ఎక్కడైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును అసలు బ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా…? అని నిలదీశారు. రాష్ట్రంలో జగనన్న ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్.

Show comments