NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వెళ్లి జనసేనానిని కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ మద్దతు కోరేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.

Read Also: CM Jagan Election Compaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ మధ్యే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్‌.. తిరుపతి నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. తనకు కూడా జనసేన తరఫున సపోర్ట్‌ చేయాలని వరప్రసాద్‌ పవన్‌ను కోరారు. పవన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.