Site icon NTV Telugu

MP Krishna Devaraya : నేను ఎప్పుడు, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తా

Mp Krishnadevaraya

Mp Krishnadevaraya

నేను ఎప్పుడు,ఏ పార్టీ లో చేరేది త్వరలోనే చెప్తా అన్నారు ఎంపీ కృష్ణ దేవరాయ. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వైసీపీలోకి వెనక్కు వచ్చే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తలకు నేను స్పందించనని ఆయన వెల్లడించారు. నేను పార్టీకి విశ్వాస ఘాతానికి పాల్పడ్డానని కామెంట్లు చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేక వేరే వాళ్ళ స్క్రిప్ట్ లు చదువుతున్నా రో తేల్చుకోవాలన్నారు. మంచి రోజు చూసుకుని అన్ని విషయాలు మీడియా కు చెప్తానని ఆయన తెలిపారు. తాను మళ్ళీ వైసీపీ లోకి వస్తున్న ట్లుగా జరుగుతున్న ప్రచారంలో, వాస్తవం లేదన్నారు ఎంపీ కృష్ణదేవరాయులు.. లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన నరసరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Yamaha RX100 New Avatar : యూత్ ను ఆకట్టుకుంటున్న బైక్.. ఫీచర్స్,ధర ఎంతంటే?

వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ పై స్పష్టత రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు పలుమార్లు సీఎం జగన్ తో భేటీ అయి విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో ఫ్యాన్ పార్టీని వీడారు. ఇటీవల నరసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉద్యోగాలు, వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు.

Mirchi : గుంటూరు మిర్చి యార్డులో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న మిర్చి టిక్కీలు

Exit mobile version