NTV Telugu Site icon

Konda Visveshwar Reddy: ఖురాన్‌లో వక్ఫ్‌ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

గుట్టం బేగం పేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు మాట ఎవరైనా వినాల్సిందే అన్నారు.. కొందరు నేతలు గడ్డం పెంచుకుని రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని.. అందులో ఖాళీ పేజీలు ఉంటాయన్నారు. భారత సైన్యం వేషం వేసుకుని గుర్రాల మీద బీజేపీ ఆఫీస్‌కు వచ్చారన్నారు. చనిపోయి 3 వందల ఏళ్లు అయినా చేవెళ్ల పార్లమెంట్ పై ఇంకా ఔరంగజేబు దాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని విరుద్ధంగా తీసుకువచ్చిన వక్ఫ్ యాక్ట్ 95 నీ అడ్డం పెట్టుకుని గుట్టల బేగం పేట రైతులను ఘోస పెడుతున్నారన్నారు.

READ MORE: Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!

వక్ఫ్ గురించి ఖురాన్ లో కూడా లేదని ఎంపీ అన్నారు. “ముస్లిం సమాజం కోసం వక్ఫ్… ఇది మతం కోసం కాదు. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.. ఇక్కడ మాత్రం అలా చేయొద్దు అంటున్నారు. గుడి దేవునికి (మతం)సంబంధించింది.. వక్ఫ్ సమాజంకి సంబంధించింది. బీఆర్‌ఎస్, కేసీఆర్ ఏమీ తక్కువేం కాదు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు దేశంను కూడా అమ్ముతారు. ఎస్సీ ఎస్టీ , బీసీ లను ఆదుకోలే.. వారితో ఆడుకుంటున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో, రాజీవ్ గాంధీ చారిటీలో బీసీ, ఎస్సీలు లేరు.” అని ఆయన మండిపడ్డారు.

READ MORE:PCC chief Mahesh Goud: పదేళ్ల బీఆర్‌ఎస్‌ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్