Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ భేటీ.. పలు సమస్యలపై వినతి

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: టీడీపీ కేంద్రం కార్యాల‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపీ కేశినేని శివ‌నాథ్ శ‌నివారం క‌లిశారు. విజ‌య‌వాడ‌లోని ప‌లు స‌మ‌స్యల‌పై విన‌తి ప‌త్రాలు అంద‌జేసి ఆ స‌మ‌స్యల‌ను వివ‌రించారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓల్డ్ రాజ‌రాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు ప‌దిహేను రోజుల్లోగా ఖాళీ చేయాల‌ని రైల్వే అధికారులు చాటింపు వేయించార‌ని…త‌మ ఇళ్లు కూల్చి వేసి ఖాళీ చేయిస్తార‌ని బాధితులు ఆందోళ‌న ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌క్షణం కూల్చివేత చర్యలు నిలిపివేసే విధంగా చ‌ర్యలు తీసుకోవ‌టంతో పాటు…ఆ త‌ర్వాత ఈ స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కార దిశ‌గా కూడా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు.

Read Also: DGP Daughter Marriage: డీజీపీ కుమార్తె వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు

అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కొండపల్లి రైల్వే స్టేషన్ స‌మీపంలో లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి కోసం ఆసక్తి చూపిన ఆ స్థలాన్ని ఎన్‌హెచ్ఏఐకి అందజేయడానికి ఏపీసీఆర్‌డీఏకు అవసరమైన భూమిని అప్పగించవలసిందిగా ఏపీజెన్‌కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాల‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

Exit mobile version