విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లను ఆహ్వానించాం అని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.
ఏడాదిలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఎంపీ కేశినేని చిన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ… ‘సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. పార్లమెంట్ మెంబర్‌గా కూర్చో బెట్టిన సీఎం చంద్రబాబు, మా యువ కెరటం నారా లోకేష్ గార్లకు ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో నా తోడున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో సమస్యల మీద దృష్టిపెట్టాం. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లు పిలిచాం. మధుర నగర్ ఆర్వోబీ, న్యూ రాజరాజేశ్వరి పేట ఆర్వోబీ వెస్ట్ ఈస్ట్ కలిపే వంతెనల డీపీఆర్ రెడీ చేశాం. మహానాడు రోడ్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు ఫ్లై ఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది’ అని తెలిపారు.
Also Read: Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!
‘నేషనల్ హైవేను గొల్లపూడి వరకు 6 లైన్స్ చేయడం జరిగింది. ఆటోనగర్‌కు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ దారులను 100 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. కనకదుర్గ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేశాం. రాబోయే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గ గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆటో నగర్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసు కోసం పోరాడుతున్నాం. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాం. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం’ అని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.
