Site icon NTV Telugu

MP K Laxman : సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్‌లో స్థాయిని మించి మాట్లాడుతున్నారు

Laxman

Laxman

బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడుతుంటే కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్ లో స్థాయి నీ మించి మాట్లాడుతున్నారని, వాళ్ళ కాళ్ళకింద పీఠాలు కదులుతున్నాయన్నారు. మోడీ, అమిత్ షా ఎక్కడ కేటీఆర్ నువ్వెక్కడా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Divya Prabha: విమానంలో నటికి లైంగిక వేధింపులు..మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన?

బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు రాష్ట్రం లో వీస్తున్నాయని, ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారన్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారని లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంకి సహకరించకుండా తెలంగాణ అభివృద్దినీ అడ్డుకుంటున్నారని, గుజరాత్ కి వెళ్లి చూసి వస్తారు… అదే గుజరాత్ మోడల్ నీ ఎగతాళి చేస్తారన్నారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంల అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. 16 తర్వాత బీజేపీ లిస్ట్ కూడా వస్తుంది. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుంది. నోటిఫికేషన్ లోపే మానిఫెస్టో, చార్జిషీట్ కూడా విడుదల చేస్తామన్నారు.

Also Read : Aamir Khan: స్టార్ హీరో ఇంట పెళ్లి భాజాలు.. కూతురు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్!

Exit mobile version