శ్రీ రామ నవమి సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతా రాములు కళ్యాణ వేడుకల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీ రామ నవమి వేడుకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత మొదటి శ్రీ రామ నవమి కావడం విశేషమన్నారు. ప్రతి గ్రామంలో అందరూ శ్రీ రాముని కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతా రాముల కళ్యాణం ప్రపంచం మొత్తం వీక్షించడం ఆనవాయితీ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి ఆ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ ను సాకుగా చూపెట్టి ఈ కుట్ర కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ విషయం పై జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతి తెప్పించానని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి శ్రీ రామ నవమి పండుగ పై ఎందుకు కుట్ర పూరితంగా వ్యవహరించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు లక్ష్మణ్. చివరికి ఆకాశవాణి ద్వరా కూడా వినిపించకుండా ఆంక్షలు విధించారని, ఇది అరిష్టంగా మేము భావిస్తున్నామన్నారు. గత ముఖ్యమంత్రి కూడా ఆనవాయితీ కి విరుద్ధంగా వ్యవహరించాడని, గత నలభై ఏళ్ల ఆచారానికి స్వస్తి పలికి అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు వారు రాజకీయంగా ఏ రకమైన మూల్యం చెల్లించుకున్నారో చూస్తున్నాని, అలాంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా వస్తుందన్నారు.
కచ్చితంగా ఈ రోజు భద్రాద్రి శ్రీ రాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది అంటే అది కేవలం బిజెపి సాధించిన విజయమే.. నిన్న డిల్లీ లో జాతీయ ఎన్నికల కమిషన్ తో మాట్లాడి అనుమతి తీసుకువచ్చాం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీక్షిస్తున్నారు.. అలాగే ముషీరాబాద్ స్ట్రీట్ నంబర్ 4 లో కూడా కులాలకు అందరూ కలిసి జరుపుకున్నారు.. అదే విధంగా ఈరోజు అయోధ్యలో జరిగిన కళ్యాణం విశిష్టత కలిగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
