Site icon NTV Telugu

MP GVL Narsimha Rao: ఏపీలో స్టిక్కర్ కాంపిటీషన్ స్టార్టయింది

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

ఏపీలో అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీ లో స్టిక్కర్ కాంపిటీషన్ మొదలయిందని, వైసిపి వెంటనే ఆపెయ్యాలన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ముఖ్యమంత్రి వాఖ్యలపై జివీఎల్ స్పందించారు. వైజాగ్ ను కేంద్రమే అభివృద్ధి చేసింది. అభివృద్ధి కోసం వెళ్తాం అంతే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నాం. టిడిపి అబద్ధపు ప్రచారం చేస్తోంది.వైసీపీనీ గద్దె దింపి బిజెపి జనసేన అధికారం లోకి రావాలి అనేది లక్ష్యం అన్నారు.

Read Also:Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ, స్పెసిఫికేషన్స్ వివరాలు..

బిజెపి వైసీపీ ల మధ్య వ్యక్తిగత బంధం కాదు, వ్యతిరేఖ బంధమే. టిడిపి బిజెపి తో పొత్తు కోసం తహహలాడుతున్నది. అన్ని గడపలు తొక్కుతోంది. టిడిపి తప్పుడు మాటలు చెపుతోంది. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపికి బిజెపి జనసీన ను చూసి అక్కసు ఎందుకు. చంద్రబాబు పుట్టిన రోజు నాడు ఇలాంటి మాటలా? అని మండిపడ్డారు జీవీఎల్. బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల సమితి.. స్టీల్ కొనడానికి EOI పిలిస్తే, స్టీల్ ప్లాంట్ కొనడానికి అనుకుని బిడ్ వేస్తామని చెప్పారు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Read Also:Weather Update: ఎండ తీవ్రత … రేపు ఆ మండలాల్లో వడగాల్పులు

Exit mobile version