Dharmapuri Arvind: అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు. నేల తల్లి నుదిటిన తిలకం పెట్టిన యువతది ఈ కోరుట్ల ప్రాంతం.. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం నా పూర్వజన్మ సుకృతం.. కోరుట్ల నియోజకవర్గం రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది అని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. కోరుట్లలో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలకు ఆదర్శంగా నిలవబోతుందని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ కోరుట్ల నియోజకవర్గంలో డబ్బులు పంచకుండా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ పేర్కొన్నారు. అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసిఆర్.. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కంటి వెలుగు తీసుకువచ్చాడు సీఎం కేసిఆర్ అని ఆయన చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Israel-Hamas War: “స్పాంజ్ బాంబులు” వాడనున్న ఇజ్రాయిల్.. హమాస్ సొరంగాలను దెబ్బతీయడమే ప్లాన్..
అయితే, నిజామాబాద్ జిల్లాలో అన్నీ స్థానాల్లో తామే గెలుస్తున్నామని ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో స్వతహాగా గెలవలేని కవిత.. ఇతరులను ఎలా గెలిపిస్తుందని ఆయన అడిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని బీజేపీ ఎంపీ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కవిత, కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోరుట్లలోనూ కవిత ప్రచారం చేయాలని అప్పుడే ఇంకా ఎక్కుగా మెజార్టీతో నేను గెలుస్తాను అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..