NTV Telugu Site icon

Dharmapuri Arvind: అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్..

Arvindh

Arvindh

లోకల్, నాన్ లోకల్ అనే వారికి ఒకటే సమాధానం చెబుతున్నాను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతాను అని ఆయన వెల్లడించారు. నేల తల్లి నుదిటిన తిలకం పెట్టిన యువతది ఈ కోరుట్ల ప్రాంతం.. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడం నా పూర్వజన్మ సుకృతం.. కోరుట్ల నియోజకవర్గం రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది అని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. కోరుట్లలో బీజేపీ గెలుపు తెలంగాణ రాజకీయాలకు ఆదర్శంగా నిలవబోతుందని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.

Read Also: KP Nagarjuna Reddy: బిజీబిజీగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం..

ఈ కోరుట్ల నియోజకవర్గంలో డబ్బులు పంచకుండా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ పేర్కొన్నారు. అబద్దాన్ని అందంగా చెప్పేవాడే కేసిఆర్.. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కంటి వెలుగు తీసుకువచ్చాడు సీఎం కేసిఆర్ అని ఆయన చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Israel-Hamas War: “స్పాంజ్ బాంబులు” వాడనున్న ఇజ్రాయిల్.. హమాస్ సొరంగాలను దెబ్బతీయడమే ప్లాన్..

అయితే, నిజామాబాద్ జిల్లాలో అన్నీ స్థానాల్లో తామే గెలుస్తున్నామ‌ని ఎమ్మెల్సీ క‌వితకు ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో స్వతహాగా గెలవలేని కవిత.. ఇతరులను ఎలా గెలిపిస్తుందని ఆయన అడిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంద‌ని బీజేపీ ఎంపీ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో క‌విత‌, కేటీఆర్ వ‌ల్లే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పెరిగిందని ఆయన ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోరుట్లలోనూ కవిత ప్రచారం చేయాలని అప్పుడే ఇంకా ఎక్కుగా మెజార్టీతో నేను గెలుస్తాను అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.