NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Pwan Kalyan

Pwan Kalyan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసినపుడు నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలన్నారు.

Also Read:Pahalgam terror Attack: ‘‘ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు, ఎంట్రీ గేట్‌ వైపు టూరిస్టుల పరుగులు’’.. వెలుగులోకి ఉగ్రవాదుల కుట్ర..

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, భారతదేశాన్ని కాపాడే పార్టీ. నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే, 7 రేస్ కోర్స్(7 రేస్ కోర్స్ రోడ్ లేదా 7 RCR అనేది భారత ప్రధానమంత్రి నివాసం) లో డ్యాన్స్ వేసుకుంటూ కూర్చోవాలి. లేకుంటే రాజకీయాలు మానేసి, రెండు సినిమాలు తీసి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలని ఎద్దేవ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా మనోభావాలు, ప్రజల, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడవద్దు. మీ నాయకుని లెక్క కుల మతాల మధ్య చిచ్చు పెట్టట్లేదని అన్నారు. నిజంగా నిలదీయాలి అంటే మీ నాయకుడినే నిలదీయాలి.

Also Read:Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ హోంవర్క్‌ చేస్తున్న ద్రవిడ్.. పిక్స్ వైరల్!

నలుగురు వచ్చి కాల్చిపోతే మీరు పిట్ట కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అడగవలసింది.. నలుగురు ముష్కరులు 28 మందిని చంపితే వారం రోజుల నుంచి అరెస్టు చేయకుండా ఎవరి వైఫల్యం జరిగిందో అడగాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఇంటెలిజెన్స్ వైఫల్యమా? కాశ్మీర్‌లో 370 పెట్టి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన అని చెప్పిన నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.