MP Bharath Ram: కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. సెంట్రల్ జైల్లో నుండి షూరిటీపై బయటకు వచ్చిన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. టీడీపీ- జనసేన మేనిఫెస్టో అమలుకు లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతుందన్న ఆయన.. సంపద ఎలా సృష్టిస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలని, పెన్షన్, జీతాలు ఏలా చెల్లిస్తారని ప్రశ్నించారు.
Read Also: Agnivir Vayu Recruitment 2024: అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తులు షురూ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్ రామ్.. కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర అంటూ ఆరోపించారు. 2014లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోను.. టీడీపీ ఎందుకు వెబ్ సైట్ లో నుండి తొలగించిందని నిలదీశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణాల చంద్రబాబే అవినీతి తిమింగలం అని మరోసారి నిగ్గు తేలిందని వ్యాఖ్యానించారు. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కు అయ్యిందన్నారు.
Read Also: Tamilisai: తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఇక, పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకంపై స్పందించిన ఎంపీ భరత్.. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపుల్లో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు రాజమండ్రి ఎంపీ భరత్ రామ్.