Site icon NTV Telugu

ముగిసిన మొదటి రోజు పాదయాత్ర

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాదయాత్రలో భాగంగా మొహిదీపట్నం రైతు బజార్ ను ఆయన సందర్శించారు. బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో.. కార్మికులతో ముచ్చటించి, కార్మికుల సమస్యలను సంజయ్ అడిగి తెసుకున్నారు.

Exit mobile version