NTV Telugu Site icon

YS Viveka Case: మరోసారి సుప్రీంకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి..

Mp Avinash Reddy

Mp Avinash Reddy

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్‌ న్యాయవాది మెన్షన్‌ చేశారు. అయితే, పిటిషన్‌ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మెన్షనింగ్‌ రిజిస్ట్రార్‌ను కలవాలని సూచించిన ధర్మాసనం. అయితే, రెండు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి… అందులో ఒకటి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై జూన్ 5న విచారణ జరిగే వరకు అరెస్ట్ లేకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఇక, తెలంగాణ హైకోర్టులో తదుపరి వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.. తెలంగాణ హై కోర్ట్ లో తదుపరి వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి.

Read Also: Perni Nani Political Retirement: సీఎంకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. ఇక, రిటైర్ అయిపోతున్నా