కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం) వాయిదా పడింది. ఈ రోజు ( సోమవారం ) మధ్యాహ్నం అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆ విచాణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ్టి విచారణలో భాగంగా హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి హాజరయ్యే సమయంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.
Read Also : Iftar party: గర్భవతి అయిన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా?.. నటి సనాఖాన్ భర్తపై నెటిజన్లు ఆగ్రహం
అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్నందుకే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుసార్లు ఆయన్ను విచారించింది. అయితే దీనిపై సీబీఐ అధికారులు స్పందించారు. విచారణకు వస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా?.. అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు జరిగాయి. భాస్కర్ రెడ్డి పిటిషన్ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
Read Also : The Rising Sun In AP : ఏపీలో మండిపోతున్న ఎండలు
దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాష్ రెడ్డి లాయర్ అన్నారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడని లాయర్ పేర్కొన్నాడు. అవినాష్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోందని అవాస్తవం అని లాయర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు హంతకులు ఎవరో తేల్చకుండా.. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే కుట్ర మాత్రమే జరుగుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి లాయర్ వెల్లడించారు.