NTV Telugu Site icon

Asaduddin Owaisi: ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోంది!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్‌ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్‌లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు.

‘వక్ఫ్‌కి వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుంది.వక్ఫ్‌ను బీజేపీ ఖతం చేయాలనుకుంటుంది. దేశంలో ముస్లింలు లేకుండా చేయాలనుకుంటుంది. సెక్షన్ 40లో తప్పులు జరిగి ఉంటే ఉదాహరణ చూపించమని ప్రధానిని నేను డిమాండ్ చేస్తున్నా. మజీద్‌లు, దర్గాలు ఎలా ఉంటాయో.. వక్ఫ్‌ ప్రాపర్టీ కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. మోడీ ప్రభుత్వం సెక్షన్ 3 ద్వారా వక్ వినియోగులని ఖతం చేయాలని ప్లాన్ చేస్తోంది. వక్ఫ్‌ వినియోగదారులు లేకుండా చూపించి ప్రభుత్వ ప్రాపర్టీగా చేయాలనుకుంటున్నారు. వక్ఫ్‌ ప్రాపర్టీకి వక్ డీడ్ చూపించాలని అంటున్నారు. ఎప్పటి నుండో ఉన్న ప్రపర్టీలకు డీడ్ ఎక్కడ ఉంటుంది. మక్కా మసీద్‌కి డీడ్ కావాలంటే ఇక్కడ నుంచి తేవాలి’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు.

‘కొన్ని సెక్షన్ల ఆధారంగా వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్స్ ఉండాలని చెపుతున్నారు. నరేంద్ర మోడీకి చాలెంజ్ విసురుతున్నాను.. కాశీ విశ్వనాథ్ టెంపుల్‌కి మెంబర్ కావాలంటే కేవలం హిందూ మాత్రమే అని సెక్షన్లో ఉంది. మరి వక్ఫ్‌ బోర్డులో కేవలం ముస్లింలు ఎందుకు ఉండకూడదు?. వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్‌లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎండోన్మెంట్ మెంబర్ కావాలంటే కచ్చితంగా హిందూ అయ్యుండాలనే నిబంధన ఉంది. వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిం తప్పకుండా ఉండాలనడం వెనుక మతలబు ఏంటి?. దీనికి మోడీ సమాధానం చెప్పాలి’ అని ఎంపీ అసదుద్దీన్ అన్నారు.

Also Read: Cyber Crime: ఎస్‌బీఐ బ్యాంక్‌కే టోకరా.. 175 కోట్లు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు!

‘బీజేపీ ప్రవేశ పెట్టే వక్ఫ్‌ బిల్లులో వక్ఫ్‌ ప్రాపర్టీని కాపాడడం సంగతి పక్కన పెడితే.. వక్ఫ్‌ లేకుండా చేసేలా ఉంది. కబరస్తాన్‌కి వెళ్లి అడగండి డీడ్ ఉందో. బీజేపీ అన్నీ అబద్ధాలు చెబుతుంది. ముస్లింలు కేవలం ఓట్లు వేసే యంత్రలుగా బీజేపీ చూస్తోంది. దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. వక్ఫ్‌ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ముస్లిం వర్గాల్లో ఈ బిల్‌పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వక్ఫ్‌ బోర్డుకి ఎవరైనా భూమి ఇస్తానని ప్రకటిస్తే.. దానిపై గెజిట్ ఇష్యూ చేస్తారు. ఆ ప్రాపర్టీపై ప్రభుత్వ అధికారులతో సర్వే చేయిస్తారు. ఆ ప్రాపర్టీ ఒక సంవత్సరం వరకు ఎవరూ అబ్జెక్షన్ చెప్పకపోతే వక్ బోర్డులో చేర్చుకుంటారు. సర్వే చేసేది కూడా ప్రభుత్వ అధికారులే, వక్ఫ్‌ బోర్డు మెంబర్లు కాదు. హిందూ ఎండోమెంట్లో సమ్మర్ ఏవక్షన్ అధికారాలు ఉన్నాయి. అవి మాకు లేవు. మాకు కూడా సమ్మర్ ఏవిక్షన్ అధికారాలు ఇవ్వండి. బీజేపీ వారికి ఒక్కటే చెబుతున్నా.. అధికారం ఎప్పటికీ మీకే శాశ్వతం కాదు’ అని అసదుద్దీన్ మండిపడ్డారు.