MP Arvind Slams Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్ మెంటు ఆపింది ఎవరు? అని ప్రశ్నించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగొద్దు అనే కుటిల ఆలోచనతో కల్వకుంట్ల కుటుంబానిధని ఆరోపించారు. అణగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దౌర్భాగ్యూలు మీరని విమర్శించారు. ఒక జనరేషన్ మొత్తాన్ని అణగదొక్కింది కల్వకుంట్ల కుటుంబం.. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మెన్ కు బీజేపీ తరఫున లేఖ పంపిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డికి కవితకు ములాఖత్ ఎంటి..? ఎందుకు రాజీనామా ఆమోదించటం లేరు..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇద్దరు ఒక్కటే..ఇద్దరు బిజినెస్ పార్ట నర్లని విమర్శించారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారని ఎంపీ అరవింద్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అడుగు వేశారు. ‘జనం బాట’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే ఈ యాత్రను ప్రారంభించడం విశేషం. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు, దాదాపు నాలుగు నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా, తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు
