Site icon NTV Telugu

MP Arvind : కవిత రాజకీయ జీవితం ముగిసింది.. దిక్కు దివాన లేదు..

Mp Arvind

Mp Arvind

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై నేడు దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. దాడి జరిగిన సమయంలో అర్వింద్‌ ఇంటి వద్దలేరు. తాజాగా ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత రాజకీయ జీవితం ముగిసింది.. దిక్కు దివాన లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఆమె ఎక్కడ నిలబడిన గెలిచే పరిస్థితి లేదని ఆయన అన్నారు. మీ మేనిఫెస్టో అడుగు.. ఆ తరువాత నా చెప్పుల అపాయింటెంట్ అడుగు అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. నేను ఇటాలియన్ చెప్పులే వాడుతానని, నేనేం తప్పు బాష మాట్లాడిన చెప్పాలన్నారు. ఆమె ముఖం చూస్తే నార్మల్ గా లేదని, సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తున్నాయని, అబ్ నార్మల్ గా కనిపిస్తుందన్నారు. మళ్ళీ నేను ఎక్కడ నిలబడితే అక్కడ పోటీ చేస్తా అంది. నేను ఇందూరు పార్లమెంట్ లోనే నిలబడతా.. వాళ్ళు నాకు దేవుళ్ళు అని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడి నుండి పోటీ చేయాలి..మాట మీద నిలబడాలని ఆయన సవాల్‌ విసిరారు.

Also Read : Pushpa Movie: పుష్ప 2 కోసం వెయిట్ చేస్తుంటే 1 మళ్లీ వచ్చేలా ఉంది..
బీజేపీ నుండి వందల కోట్ల ఆఫర్ ఎవరు ఇచ్చారు.. నా చెప్పుల బ్రాండ్ కూడా చెబుతా.. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా దొంగలు.. గులాబీ కండువా లకు అమ్మడు పోయారు.. మహేందర్ రెడ్డి లాంటి యూజ్ లెస్ పోలీస్ బాస్ ని నేను ఇంత వరకు చూడలేదు… అమ్ముడు పోయిన సరుకు.. ఎంపీల పైన ఎన్నోసార్లు దాడులు జరిగాయి.. నా మీద దాడి కొత్త కాదు.. చేతగాని మహేందర్ రెడ్డి.. ఆయనతో ఏం కాదు.. అక్కడ టీఆర్‌ఎస్‌ది కాదు..మహేందర్ రెడ్డిది తప్పు.. ఇండిపెండెంట్ గా ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.. ఆమె ఎన్నికలే గెలవలేదు.. ఈరోజు ఆమె పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు ఆమెను ఓడగోట్టారు.. నేను ఆమె మీద ఎం అనుచిత వ్యాఖ్యలు చేసాను.. మల్లికార్జున్ ఖర్గే ఫోన్ కి ఫోన్ చేశారని చెప్పా.. లేదంటే ఖండిచమని చెప్పు.. ఈమె లేకిపనులు చేస్తేనే ఇందూరు ప్రజలు ఓడగొట్టారు.. నేను ఆక్సిడెంటల్ గా గెలిచాను అంటున్నారు.. మరోసారి ఇందూరు నుండి పోటీ చేస్తా ఇప్పుడు గెలువు..’ అని ఆయన సవాల్‌ విసిరారు.

Exit mobile version