Site icon NTV Telugu

MP Aravind : రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగింది

Dharmapuri Arvind

Dharmapuri Arvind

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని, తప్పుడు నివేదికలు సమర్పించారన్నారు. జరిగిన పనుల్లోనూ 25 శాతం కమిషన్ లు తీసుకున్నారని, తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన నిధులను, కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.

Also Read : Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!

కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించినట్టు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారని.. శిలా ఫలకం మీద మాత్రం రుణం తీసుకున్న నిధులతో నిర్మించినట్టు పేర్కొంటున్నారని అన్నారు. ఒక పనిని రెండు నిధులతో ఎలా చేస్తారని.. మిగిలిన నిధులు ఎటు మళ్లించారని ప్రశ్నించారు. చేసిన పనిలోనూ ప్రశాంత్​రెడ్డి 25 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే త్వరలో కవిత.. దిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ముఖం చెల్లక విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే.. సిద్దిపేటలో ఔటర్​ రింగ్​రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు.

Also Read : Old City Metro : పాతబస్తీలో మెట్రో… సన్నాహక పనులను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్

Exit mobile version