అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్షన్స్ ముందు సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ సీఎం చేస్తుందని చెప్పారు. పోలవరం, అమరావతిలను నిర్మించేది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. దళితులు, ఆదివాసీలను సీఎం కానివ్వరా అని.. అధికారంలోకి వస్తే సీతక్కకు ఉపముఖ్యమంత్రి పదవైనా ఇవ్వాలని ఎన్నారైలు కోరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అవసరమైనతే పార్టీ సీతక్కను సీఎం చేస్తుందన్నారు.
Also Read : Mallu Ravi : కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు
అయితే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Ambulance Misuse : మిర్చి బజ్జీల కోసం సైరన్‌తో అంబులెన్సు వేసుకెళ్లిన డ్రైవర్
ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయన్న భయం కేసీఆర్ లో మొదలైందని, అందుకే ముస్లిం మత పెద్దలను పిలుచుకుని కేసీఆర్ మీటింగ్ పెట్టుకున్నాడన్నారు అర్వింద్. యూసీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా పాస్ అవుతుందని, యూసీసీ బిల్లు పాస్ అయ్యాక కేసీఆర్ పాకిస్తాన్ పోతానంటే వెళ్ళిపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. 24గంటల విద్యుత్ పై రేవంత్ కామెంట్స్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాడని ఆయన అన్నారు.