NTV Telugu Site icon

MP Dharmapuri Arvind : రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది

Mp Aravind

Mp Aravind

అకాల వర్షాలపై ఐఎండీ డిపార్ట్మెంట్ ముందస్తు సమాచారం ఇస్తుందని, సోయి ఉన్నోళ్లు ఎవరైనా దీనిపై ముందస్తు చర్యలు చేపడుతారంటూ విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. నా పార్లమెంట్‌లో 40వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి 50 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫసల్ భీమా డబ్బులు కాకుండా ఈ 50వేలు ఇవ్వాలని, మా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఎకరానికి 32వేలు, మహారాష్ట్ర ఎకరానికి 9 నుంచి 12వేల పంట నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. ఇవి ఫసల్ భీమా డబ్బులకు అదనమని, రాష్ట్రం మొత్తం మునిగిపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఫార్మ్ హౌస్ లో ఉంటున్నారని ఆయన ఆరోపించారు.

Also Read : MP Uttam Kumar : రాహుల్ గాంధీపై పెద్దఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు

సీఎం వలే మంత్రులు.. వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం కన్న పెద్ద ఫార్మ్ హౌస్ ఉందటా? రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? అబ్ కి బార్ కిసాన్ సర్కార్ క్యాప్షన్ పెట్టునే అర్హత నీకుందా? ఇది దగుల్బాజీ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటి స్థానం లో ఉందని, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లో కేంద్రం వాటా 75 శాతం ఉంటుందని, దీని నుంచి డబ్బులు విడుదల చేయని సోమరిపోతు సీఎం కేసిఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. కేసిఆర్ సీఎం కు అనర్హుడు అని ఎంపీ అరవింద్‌ మండిపడ్డారు.

Also Read : Walnut: “నా జీతం మీ స్టార్టప్ కన్నా ఎక్కువ”.. మహిళ ఉద్యోగి రిఫ్లైని రెండేళ్లైనా మర్చిపోలేకపోతున్న సీఈఓ

కేసిఆర్ అన్నదాత ఊసురు ఎవరికైనా మంచిది కాదని, పంట నష్టంపై గవర్నర్ కలుగజేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని రైతులకు న్యాయం చేయాలన్నారు. బిడ్డ, కొడుకును కాపాడేందుకు బీఅర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని, కిసాన్ సర్కార్ అంటే రైతు బంధు, రైతు భీమానా? అని ఆయన అన్నారు. 36లక్షల మందికి గాను 5లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, సీడ్ బౌల్ గా తెలంగాణ అవ్వలేదు కానీ ఏపీ అవుతోందన్నారు. పోడు భూముల సంగతేంటని, ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ కాదు … జైల్ సర్కారే అని ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినట్లు బొందల గడ్డ పేరును వైకుంఠ దామంగా మార్చారు తప్పా కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ఇచ్చే దళిత బంధులో కమీషన్ తీసుకుంటున్నారని, దళిత బంధు ఇచ్చిన వాళ్లతో ప్రతిపక్ష పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు జేసీ.. మహారాష్ట్రలో పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎంపీ అరవింద్‌ ధ్వజమెత్తారు.

Show comments