NTV Telugu Site icon

MP Adala Prabhakar Reddy: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ

Mp Adala Prabhakar Reddy

Mp Adala Prabhakar Reddy

MP Adala Prabhakar Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. విపక్షాల వైపు చూస్తున్నారు.. కొందరు ఇప్పటికే టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. మరికొంతమంది సైతం టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది.. ఆ ప్రచారంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు.. నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్‌సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..

Read Also: High Court: రైతులను అడ్డుకునేందుకు రోడ్లు ఎందుకు మూసేశారంటూ పంజాబ్- హర్యానా హైకోర్టు ఆగ్రహం

ఇక, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలుస్తాను అని తెలిపారు ఎంపీ ఆదాల.. మరోవైపు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మా గుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చలు జరిపా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు.. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాను.. కానీ, నా ప్రయత్నం ఫలించలేదని.. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాను అని వెల్లడించారు. అయితే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని.. వైసీపీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని అంటున్నారని పేర్కొన్నారు.

Read Also: Paytm Crisis: క్యూఆర్ కోడ్‌లు పని చేస్తాయి.. వ్యాపారులకు హామీ ఇచ్చిన పేటీఎం

మరోవైపు.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి ఆనం విజయకుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారంపై స్పందించిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమైనంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకోవడం సరికాదన్నారు.. నెల్లూరు సిటీ లేదా రూరల్ లో పార్టీకి మరింత సహకారం అందించమని కోరి ఉండవచ్చు కదా? అని ప్రశ్నించారు.. మీడియా మాత్రం తనకు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి.