NTV Telugu Site icon

Arikomban : ఏనుగుల్లో కెల్లా అ ఏనుగు చాలా స్పెషల్‌.. అందుకే..

Arikoban

Arikoban

ఏనుగుల్లో కెల్లా అ ఏనుగు చాలా స్పెషల్‌… జనాలను వణికించడంలోనే కాదు ఆహారం తినే విషయంలో తన డైట్ తనదే.నెల రోజులుగా తమిళనాడు, కేరళ వాసులకు చుక్కలు చూపించిన అరికోంబన్ ఏనుగు ఎట్టికేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. రైస్ అంటే ఎంతో ఇష్టపడే అరికొంబన్..35ఏళ్లుగా చాలాసార్లు ఊళ్ల మీదకు వచ్చి ఇళ్ల మీద దాడి చేసి రైస్ మాత్రం తినడం అలవాటు చేసుకుంది ..తన నచ్చిన ఆహారంలో తినే క్రమంలో జనాలకు చుక్కలు చూపింది. ఇక అరికొంబన్ మెయిన్ క్యారెక్టర్ గా ఓ సినిమా కూడా రాబోతోంది అంటే ఈ ఏనుగు ఎంత స్పెషల్ అర్ధం చేసుకోవచ్చు ..

Free Current: గుడ్‌ న్యూస్‌.. వారందరికీ 200యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌

నెలరోజుల పాటు తమిళనాడు-కేరళ సరిహద్దు గ్రామాల ప్రజలను వణికించిన అరికొంబన్ ను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దాన్ని అతి జాగ్రత్తగా ఓ భారీ వాహనం ఎక్కించి అత్యంత భద్రత మధ్య తేని జిల్లా నుంచి బయటకు తీసుకెళ్లారు. ఎక్కడి విడిచిపోతున్నారో ఈసారి గోప్యంగా ఉంచుతున్న అటవీశాఖ అధికారులు..దాన్ని వెతికే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినదిగా భావించే ఈ 35ఏళ్ల మగ ఏనుగుకు ధాన్యం అంటే చెప్పలేనంత ఇష్టం. ఎంతిష్టం అంటే పంటపొలాల మీద పడి దాడి చేసి రైస్ తినటం కాదు..అక్కడ లేకపోతే ఊళ్లకు మీదకు వచ్చి వంటగదిలో దూరి డబ్బా తీసి మరీ రైస్ తింటుంది. అంత ఇష్టం. మలయాళంలో అరికొంబన్ అంటే అర్థం ధాన్యం తినే వైల్డ్ టస్కర్ అనే. ఇలాంటి అరుదైన ఏనుగు ఇండియన్ వైల్డ్ లైఫ్ హిస్టరీలోనే అత్యంత అరుదు. అందుకే ఆ ఏనుగు ఎంత విధ్వంసం చేసినా అటవీశాఖ అధికారులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. 1987 నుంచి ఇప్పటికి 4-5సార్లు ఊర్ల మీదకు వచ్చి ఉంటుంది ఈ ఏనుగు. వచ్చిన ప్రతీసారి ప్రజలను హడలెత్తించటమే. ఈసారి నెలరోజుల పాటు తమిళనాడులోని తేని జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయభ్రాంతులకు గురి చేసింది. ప్రజలను పరుగులు పెట్టించింది. మొత్తంగా అటవీశాఖ అధికారులు ఈసారి అరికొంబన్ ను జాగ్రత్తగా అడవిలో విడిచి పెడతామని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రైస్ మాత్రం తినే అరికొంబన్ మెయిన్ క్యారెక్టర్ గా ఓ సినిమా కూడా వస్తోంది.

Show comments