Mouth Ulcer: నోటిలో పుండ్లు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు ఉంటాయి. అయినా తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: G20 Dinner Menu: జీ20 డిన్నర్‌లో భారతీయ రుచులు.. వంటకాల పూర్తి జాబితా ఇదే
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
నోటి పుండ్లకు వంటింటి చిట్కాలతో కూడా చెక్ పెట్టవచ్చు. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజులో నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్లను నివారించవచ్చు. ఇక ఉల్లిగడ్డలు కూడా ఈ నోటి పుండ్లను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు వీటిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అల్సర్ దగ్గర చిన్న ముక్క ఉంచినా లేదా ఉల్లి రసం తీసుకొని నోరు పుక్కిలించుకున్న ఉపశమనం లభిస్తుంది. ఇక నోటి పుండ్లకు విటమిన్ బీ12 లోపం కూడా ఓ కారణం. కాబట్టి ఈ విటమిన్ కు సంబంధించిన ఆహారం తీసుకున్న, టాబ్లెట్లు తీసుకున్న తొందరగా ఉపశమనం పొందవచ్చు. అయితే టాబ్లెట్ లు వాడే ముందు డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. ఇక తేనె కూడా వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్లు వచ్చినప్పుడు నోటిని తేమగా ఉంచుకోవడం అవసరం. తేనె తీసుకుంటే నోరు తేమగా ఉంటుంది. అంతేకాకుండా తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ ఈ పుండ్లకు కారణమయిన బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. ఇక ఐస్ ముక్కలతో మసాజ్ చేసిన ఈ సమస్య తగ్గుతుంది. ఈ అల్సర్లు మండుతున్నా, నొప్పి ఎక్కువగా ఉన్నా ఆ ప్రదేశంలో కొబ్బరి నూనె రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నూనెను గాయాలు మాన్పడంలో ఎంత చక్కగా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!