NTV Telugu Site icon

Bhukya Yashwant: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మౌంట్‌ క్యాంగ్‌ యాట్సీ-2 అధిరోహకుడు..

Bhukya Yashwanth

Bhukya Yashwanth

6,250 మీటర్ల ఎత్తైన మౌంట్‌ క్యాంగ్‌ యాట్సీ-2 అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలబెట్టిన భూక్యా యశ్వంత్.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. మహబూబాబాద్ జిల్లాలో మారుమూలన ఉన్న ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన గిరిజన యువకుడు, మౌంటేనీర్ భూక్యా యశ్వంత్.. ఇతను పర్వత అధిరోహణలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు. ఇప్పుడు హిమాలయాల్లో లడఖ్ ప్రాంతంలో ఉన్న 6250 ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Read Also: Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్

ఇప్పటికే దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, యూరప్​లోని మౌంట్ ఎలబ్రస్, ఆస్ట్రేలియాలోని మౌంట్ కొస్క్లాస్కో, హిమాచల్ లోని మౌంట్ యూనమ్, మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించి దూసుకెళుతున్న యశ్వంత్ ఈసారి మరింత ఎత్తయిన శిఖరాన్ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. గత నెలలోనే యశ్వంత్ ఆసక్తిని, ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. మౌంట్ క్యాంగ్ ను విజయవంతంగా అధిరోహించిన యశ్వంత్ అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను ప్రదర్శించి తన కృతజ్ఞతను చాటుకున్నారు.

Read Also: Suicide: అమ్మ, నాన్న జాగ్రత్త.. సూసైడ్ నోట్ రాసి బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

తన ఆనందం, విజయంలో ముఖ్యమంత్రి అందించిన సహకారం మరిచిపోలేనిదని గుర్తు చేసుకున్నాడు. ‘సీఎం నాయకత్వ పటిమ, దూరదృష్టి, కృషి, ప్రజల పట్ల చూపించే శ్రద్ధ ఎంతో స్ఫూర్తిని అందించాయి. తనపై ఉంచిన నమ్మకం, ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ఈ విజయానికి దోహదపడింది..’ అని యశ్వంత్ లేఖలో పేర్కొన్నారు.